‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సరసన తెలుగు హీరోయిన్ కూడా !

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, ఆయన జోడీగా అలియాభట్‌ నటిస్తోంది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తుండగా ఆయనకు జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ సందడి చేయనున్నారు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు ఇద్దరని తెలిసింది. మరో హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేష్ ని తీసుకున్నట్టు సమాచారమ్.

వాస్తవానికి అల్లూరి, కొమరం భీమ్ లకి పెళ్లిళ్లు కాలేదు. అలాంటప్పుడు వారికి జంటగా హీరోయిన్స్ ఎందుకు అనే ప్రశ్న గతంలోనే తెరపైకి వచ్చింది. అయితే వీరిద్దరికి పెళ్లిళ్లు కాకపోయినా.. ప్రేమకథలున్నాయ్. అల్లూరి మరదలు సీతతో లవ్ స్టోరీ సాగించారు. కొమరంభీమ్ ఇంగ్లీష్ పిల్లతో రొమాన్స్ చేశారనే ప్రచారం ఉంది.

అయితే ఇప్పుడు కొమరం భీమ్ కు ఒక్కరు కాదు.. ఏకంగా ఇద్దరిని అట్టగడుతున్నారు జక్కన్న. దీనిపై వివాదాలు ఏమైనా వస్తాయోమో.. ! ఇప్పటికే రామరాజు ఫర్ భీమ్ టీజర్ లో ఎన్ టీఆర్ ముస్లిం యువకుడి గెటప్ లో కనిపించడంపై గిరిజనులు, రాజకీయ నేతలు భగ్గుమంటున్నారు. ఈ వివాదంపై ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ఇప్పటి వరకు స్పందించలేదు.