తెరాస ఎమ్మెల్యేపై దాడి.. హరీష్ రావు కామెంట్స్ !

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ‘తెరాస-భాజాపా’ల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగింది. ప్రచారం ముగిసిన తర్వాత ఆ హీటు చల్లారాలి. కానీ డబుల్ అయింది. సోమవారం రాత్రి సిద్దిపేటలో తెరాస-భాజాపా కార్యకర్తలు తన్నుకున్నారు. రక్తాన్ని కళ్ల చూశారు. సిద్దిపేటలో క్రాంతికిరణ్‌ బస చేసిన హోటల్‌లోకి భాజపా కార్యకర్తలు దూసుకెళ్లారు. దీంతో తెరాస, భాజపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

ఈ ఘటనపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. ”దుబ్బాక ఉప ఎన్నిక భాజపా ఇన్‌ఛార్జి జితేందర్‌రెడ్డి జిల్లాలోనే ఉంటే తప్పుకాదా? ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సిద్దిపేటలో ఉంటే తప్పేంటీ? భాజపా నేతలు శాంతి భద్రతలు దెబ్బతీయాలని చూస్తున్నారు. భాజపా కార్యకర్తల దాడికి ముందు పోలీసులు తనిఖీ చేసి వెళ్లారు. పోలీసుల తనిఖీల్లో ఎలాంటి ప్రచార సామగ్రి లభించలేదు” అని పేర్కొన్నారు.