జగన్ సర్కార్’కు మరోసారి కోర్టు అక్షింతలు
ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది. ఎక్కడ సహకరించడం లేదో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు అడగ్గా.. ఈసీకి రూ.40 లక్షలు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయడం లేదని నిమ్మగడ్డ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తాజాగా తీర్పు వెల్లడించిన ఉన్నత న్యాయస్థానం ఎస్‌ఈసీకి సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది
నిజాయితీగా పనిచేసే అధికారులను ఇబ్బందులకు గురిచేయటం మంచికాదని హైకోర్టు పేర్కొంది. తనకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లి న్యాయంగా పదవి పొందిన వ్యక్తిని…ప్రభుత్వం కావాలనే ఎస్ఈసీకి సహాయ సహకారాలందించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై తీర్పునిచ్చింది. దీనిపై 15 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో సీఎస్‌ను సుమోటాగా ప్రతివాదిగా చేర్చింది.