కాజల్ పెళ్లిని సెట్ చేసిన లాక్డౌన్ !
వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఇదీ నిజం. కాజల్ పెళ్లి చేసుకోవాలని చాన్నాళ్ల క్రిందటే డిసైడ్ అయింది. ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది. నేను పెళ్లికి రెడీ. సరైనోడు గురించి వెతుకుతున్నాని ప్రకటించింది. అయితే కరోనా లాక్డౌన్ గౌతమ్ ని జీవిత భాగస్వామిగా ఎంచుకొనేలా చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ నే చెప్పింది.
‘నేను, గౌతమ్ మూడేళ్లుగా డేటింగ్లో ఉన్నాము. ఆ తరువాత ఏడేళ్లుగా స్నేహితులుగా ఉన్నాము. ఆ సమయంలో తాము ఒకరికి మరొకరు ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. ఇక ఈ లాక్డౌన్లో మేమిద్దరం కొన్ని వారాల పాటు కలుసుకోలేదు. ఆ సమయంలో ఒకరిని మరొకరం మిస్ అయ్యాము. దీంతో ఇకపై కలిసి ఉండాలని నిర్ణయించుకొని పెళ్లి చేసుకున్నాం’ అని కాజల్ చెప్పుకొచ్చారు.
ఏడేళ్ల పరిచయం, మూడేళ్ల ప్రేమ కాజల్ ని పెళ్లి సెట్ చేసింది. గత నెల 30న కాజల్-గౌతమ్ ల పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ మూడులో ఉంది. కొన్నాళ్లు సంసార జీవితాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత కాజల్ సినిమా షూటీంగ్ లో పాల్గొననుంది. ఆచార్య, మోసగాళ్లు, భారతీయుడు 2 సినిమా షూటింగ్ లని ఆమె పూర్తి చేయనుంది.