కన్నడ డ్రగ్స్ కేసు : హీరోయిన్స్ కి మరోసారి నిరాశ

కన్నడ డ్రగ్స్ కేసులో హీరోయిన్స్ సంజన గల్రానీ, రాగిణి త్రివేది అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు..  ఈ ఇద్దరు హీరోయిన్స్. వీరికి మరోసారి నిరాశే ఎదురైంది. రాగిణి, సంజనల బెయిల్ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.

రాగిణి, సంజన ప్రస్తుతం బెంగళూరు పరప్పన జైలులో ఉన్నారు. డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 4న రాగిణి త్రివేది అరెస్ట్ అయ్యారు. సెప్టెంబర్ 8న సంజనని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వీరు బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ బెయిల్ దొరకడం లేదు. ఇక డ్రగ్స్ కేసు విచారణలో వీరిద్దరి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. వీరు వ్యభిచారం ముఠాని నడిపారనే ఆధారాలు కూడా లభించాయని వార్తలు వచ్చాయి.