ఆన్ లైన్ గ్యాంబ్లింగ్.. సెలబ్రెటీలకి నోటీసులు !

ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌పై సెలబ్రిటీలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్యాంబ్లింగ్‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన క్రికెటర్లు విరాట్‌ కొహ్లి, సౌరవ్‌ గంగూలీ, సినీ నటులు దగ్గుపాటి రానా, సుదీప్‌, ప్రకాశ్‌ రాజ్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కు వ్యతిరేకంగా మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌లో వందలాది మంది డబ్బులు పొగొట్టుకున్నారని పిటిషినర్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన కోర్టు.. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ కు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీలకు నోటీసులు అందించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ని నిషేధించింది. ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ని నిషేధిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.