ప్రధాన టెక్‌హబ్‌గా హైదరాబాద్ : కేటీఆర్
హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ కొత్త కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. నగర అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, మౌలిక సదుపాయాలు, స్థిరాస్తి రంగాన్ని విశ్లేషిస్తూ నైట్ ఫ్రాంక్ సంస్థ తయారు చేసిన వర్క్ ఫ్రమ్ హైదరాబాద్ నివేదికను మంత్రి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ‘గత ఆరేళ్లలో దేశంలో ప్రధాన టెక్‌హబ్‌గా హైదరాబాద్ అవతరించిందన్నారు. అతి తక్కువ సమయంలోనే ప్రముఖ బహుళజాతి సంస్థలను తెలంగాణ ఆకర్షించిందని కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహా ప్రగతి సాధిస్తూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.