అక్క ముందే బావతో.. కాజల్ చెల్లెలు !
బావ-మరదలు అంటే… కాసింత మజా ఉంటుంది. కొత్తగా పెళ్లైన బావని మరదలు ఆటపట్టించడం చేస్తుంటారు. అయితే కాజల్ చెల్లెలు ఈషా అగర్వాల్ కూడా దాదాపు అదే చేస్తోంది. కాకపోతే ఇక్కడ అక్కడ అక్క కంటే చెల్లెలుకి ఎక్సిపీరియన్స్ ఎక్కువ. ఇదివరకే ఈషాకి పెళ్లైన సంగతి తెలిసిందే. ఓ బాబు కూడా ఉన్నాడు.
ఆ అనుభవంతోనే కొత్తగా పెళ్లైన అక్కకు సలహాలు, సూచనలు చెబుతుందట. ఈ విషయం పక్కనపెడితే అక్కా-బావతో ఈషా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఫోటోలో బావ నీకు మైదాకు పెడతా అన్నట్టుగా ఆయనకి రంగుపూస్తోంది ఈషా.
ఇక గౌతమ్ కిచ్లూ కాజల్ కి చిన్ననాటి స్నేహితుడని చెబుతున్నారు. కలిసే చదువుకున్నారట. కాజల్ ఏమో.. గౌతమ్ ఏడేళ్లుగా తెలుసు. మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నాము. కరోనా లాక్‌డౌన్‌లో మేమిద్దరం కొన్ని వారాల పాటు కలుసుకోలేదు. ఆ సమయంలో ఒకరిని మరొకరం మిస్ అయ్యాము. దీంతో ఇకపై కలిసి ఉండాలని నిర్ణయించుకొని పెళ్లి చేసుకున్నామని చెప్పిన సంగతి తెలిసిందే.