పవన్’తో శ్రీముఖీ సెల్ఫీ పిక్స్.. వైరల్ !


యాంకర్ శ్రీముఖి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఆమె సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఈ సమయంలో రాయడానికి మాటలు రావడం లేదు. లవ్ లవ్ లవ్ పవన్ స్టార్’ అంటూ ట్వీట్ చేసింది. ఇందులో పవన్ వకీల్ సాబ్ గెటప్ లో ఉన్నారు. దీంతో.. వకీల్ సాబ్ లో నటిస్తున్నానని శ్రీముఖి హింట్ ఇచ్చినట్టయింది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ తెరకెక్కుతోంది. పవన్ కి జంటగా శృతిహాసన్ నటిస్తున్నారు. మరో ముఖ్యపాత్రల్లో అంజలి, నివేదా థామస్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ తో వాయిదాపడిన వకీల్ సాబ్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. దీంతో లుక్ మార్చేసిన పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.