‘పుష్ప’ షూటింగ్ మళ్లీ వాయిదా.. ఎందుకంటే ?
బన్నీ-సుకుమార్’ల హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆర్నెళ్ల ఆలస్యమైంది. ఈ నెల 5 నుంచి రంపచోడవరం, మారేడిమిల్లి ప్రాంతాల్లో పుష్ప షూటింగ్ ను ప్లాన్ చేసారు. వూడ్స్ రిసార్ట్, రాజమండ్రిలో కొన్ని హోటళ్లు బ్లాక్ చేసారు. కానీ మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
అటవీ ప్రాంతంలో వేయాల్సిన సెట్ లు అవీ ఇంకా రెడీ కాకపోవడమే కారణం అని తెలుస్తోంది. ఈ నెల 8 లేదా 9 నుంచి పుష్ప షూట్ ప్రారంభం అయ్యే అవకాశం వుంది. ఈ సినిమా కోసం స్టంట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ పని చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనే కొన్ని కీలక ఫైట్లు వున్నాయని తెలుస్తోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కనుంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తారు. ఆయనకు జంటగా రష్మిక మందన నటించనున్నారు. ఇక ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకోనున్నారు. విలన్ పాత్ర కోఅం తమిళ్ లేదా మలయాళ నటుడిని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.