బిగ్ బాస్ సామ్రాట్ రెండో పెళ్లి (వీడియో)


బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. కర్ణాటకకు చెందిన అంజనా శ్రీలిఖితను పెళ్లాడాడు. ఎలాంటి హడావిడి లేకుండా కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.ఈ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు దీప్తి సునైనా, తనిష్ సహా పలువురు హాజరయ్యారు.

సామ్రాట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో అలరించిన సామ్రాట్ బిగ్ బాస్ రియాలిటీ షో తో ఫెమస్ అయ్యాడు. బిగ్ బాస్ తరవాత కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. సామ్రాట్ తన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డాడంటూ మొదటి భార్య హర్షిత కేసు పెట్టింది. ఆ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు. మొదటి భార్యతో విడిపోయిన తర్వాత కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న సామ్రాట్.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారు.  సామ్రాట్ పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.