ఢిల్లీ ‘సున్నా’ రికార్డ్
ఐపీఎల్ లో ఢిల్లీ అరుదైన రికార్డుని ఖాతాలో వేసుకొంది. అదే సున్నా రికార్డ్. గురువారం ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఖాతా తెరవకుండానే మొదటి మూడు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. పృథ్వీషా, అజింక్య రహానె, శిఖర్ ధావన్ ముగ్గురు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. సున్నా పరుగులకే ముగ్గురు బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరడం ఐపీఎల్ చరిత్రలో ఇదే ప్రథమం.
ఇక ఈ మ్యాచ్ లో ముంబై తురుపున రెండు రికార్డులు నమోదయయ్యాయ్. లీగ్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ముంబయి పేస్ బౌలర్ బౌల్ట్(14 వికెట్లు) రికార్డు సృష్టించారు. మరో రికార్డ్ ఏంటంటే.. ? ముంబయి మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేసిన ప్రతిసారి గెలిచింది. ఇప్పటి వరకూ 11 మ్యాచుల్లో ఇదే జరిగింది.
నిన్నటి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ముంబయి 200 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక చేధనలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన కేవలం 143 పరుగులే చేయగలిగింది.