గ్రేటర్ వరద సాయంలో భారీ కుంభకోణం
భారీ వర్షాలు-వరదలు హైదరాబాద్ నగరాన్ని వణికించిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల ఆస్థి నష్టం జరిగింది. నగరంలోని వందలాది కాలనీలు రోజుల తరబడి నీళ్లలోనే ఉన్నాయి. వారిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సాయం ప్రకటించింది. ప్రతి ఇంటికి రూ. 10వేలు అందించింది. అయితే సాయం అందించడంలో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
వరద సహాయక చర్యల్లో తెరాస నేతలు, కార్యకర్తలు రూ.కోట్లు దోచుకున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్ది ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని.. బాధిత కుటుంబాలకు సహాయన్ని నగదు రూపంలో కాకుండా చెక్కుల రూపంలో అందించాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఇచ్చే వరద సాయం రూ.10వేల నుంచి రూ.50వేలకు పెంచాలని కోరారు.
మరోవైపు వరదసాయాన్ని అధికారులు కాకుండా తెరాస నేతలు పంచారని చెబుతున్నారు. దీంతో తెరాసకు సపోర్ట్ గా లేని వారికి ఈ సాయం అందలేదనే విమర్శలున్నాయ్. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా దీనిపై అధికారులని నిలదీశారు. తన లోక్ సభ నియోజకవర్గంలో వరదసాయంలో భారీగా విజ్ఝప్తులు వస్తున్నాయి. మీరు ఎవరికి సాయం అందించారో పిలవండి అని నిలదీశారు.