రోహిత్ శర్మ ఖాతాలోకి.. ఓ అనవసరపు రికార్డు !
ఐపీఎల్ లో హిట్ మ్యాచ్ రోహిత్ శర్మ్ ఖాతాలో ఓ అనవసరపు రికార్డ్ వచ్చి చేరింది. ఢిల్లీతో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ముంబయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ముంబయి 200 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక చేధనలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన కేవలం 143 పరుగులే చేయగలిగింది.
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ విఫలమయ్యాడు. అతడు ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. టోర్నీ చరిత్రలో ఇలా మొత్తం 13 సార్లు డకౌటై ఓ అనవసరపు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్ ఇలాగే 13సార్లు డకౌటయ్యారు. హిట్‌మ్యాన్ ఇప్పుడు వారి సరసన చేరాడు.మరోవైపు ప్లేఆఫ్స్‌లోనూ ఇలా డకౌటవ్వడం రోహిత్‌కిది మూడోసారి. ఇప్పటివరకు ప్లేఆఫ్స్‌లో మొత్తం 19 ఇన్నింగ్స్ ఆడిన ముంబయి సారథి 12.72 సగటుతో 229 పరుగులే చేశాడు.