లాస్య ఏడేళ్ల పాటు రహస్య కాపురం.. రెండు సార్లు అబార్షన్ !!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రసరవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సగం సీజన్ పూర్తయింది. ఈ క్రమంలో సభ్యులకి టఫ్ టాస్క్ ఇస్తున్నారు బిగ్ బాస్. అదే సమయంలో సభ్యుల గురించి ఆసక్తికర విషయాలు రాబడుతున్నారు. గురువారం ఏపీసోడ్ లోనూ.. మీరు చేసిన పనుల వలన ఇతరులకు జరిగిన మేలు, లేదా మీ వల్ల మీరు చేసుకున్న చెడుని చెప్పమని బిగ్ బాస్ కోరారు. ఈ క్రమంలో లాస్య తన వివాహ జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పింది.
‘2010లోనే నేను పెళ్లి చేసుకున్నా. ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. పెళ్లి చేసుకొన్నాక మేము వేర్వేరుగానే ఉన్నాం. 2014 నుంచి కలిసి ఉన్నాం. అయితే ఆ నాలుగేళ్లు నాతో మాట్లాడని నాన్న ఫోన్ చేసి.. మీకు పెళ్లైనట్టు ఎవ్వరికి చెప్పకండి. మీ ఉద్యోగాల్లో స్థరపడండి. మీకు మేం మంచి టైమ్ చూసి పెళ్లి చేస్తాం అన్నారు.
అయితే అప్పుడే తనకి ప్రెగ్నెన్సీ ఖాయమైంది. అబార్షన్ చేయించుకున్నా. ఇక 2017లో మాకు మరోసారి పెళ్లైంది. పెళ్లిన 4 నెలలకే మళ్లీ ప్రెగ్నెన్సీ ఖాయమైంది. అయితే మరోసారి అబార్షన్ తప్పలేదు. ఫైనల్ 2018లో నాకు బాబు పుట్టాడు. అయితే మొదటి సారి అబార్షన్ చేయించుకున్న ఫైల్ ఇప్పటికీ నా దగ్గరుంది. అది చూసినప్పుడల్లా ఏడుపొస్తుంది’ అని ఏడ్చేసింది లాస్య.