తండ్రితో విజయ్ పొలిటికల్ వార్.. !
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానుల బలమైన కోరిక. తమ ఆకాంక్షని తెలియజేస్తూ తమిళనాడులో పలుమార్లు బ్యానర్లు కట్టారు. ఈ బ్యానర్ల మీద ఏపీ సీఎం జగన్ ఫోటో కూడా ఉంచారు. ఆ బ్యానర్ లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. మరోవైపు విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని.. ఆయన తండ్రి చంద్రశేఖర్ పలు మార్లు ప్రకటన చేశారు. తాజాగా తన కుమారుడి అభిమాన సంఘాన్ని రాజకీయ పార్టీగా రిజిస్ర్టేషన్ చేయించనున్నట్టు చంద్రశేఖర్ సంచలన ప్రకటన చేశారు. దీంతో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయ్.
అయితే తండ్రి ప్రకటనపై విజయ్ ఘూటుగా స్పందించారు. తండ్రి ప్రకటనతో తనమేమీ సంబంధం లేదని ప్రకటించారు. అంతేకాదు.. తన తండ్రి ప్రారంభించబోయే పార్టీలో తన అభి మానులెవరూ చేరకూడదని ఆయన ఆదేశించారు. తన తండ్రి ప్రారంభించబోయే పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరును రాజకీయ పార్టీగా ఉపయోగించినా, ఆ ఇయక్కమ్కు సంబంధించిన పతాకాన్ని వాడినా తగు చర్యలు తీసుకుంటానని కూడా విజయ్ హెచ్చరించారు. దీంతో తండ్రితో విజయ్ కి పొలిటికల్ వార్ జరుగుతున్నట్టు కనబడుతోంది.