కమల్ బర్త్ డే గిఫ్ట్.. అదిరిపోయింది !

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన పుట్టినరోజున అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఆయన 232వ సినిమా టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ బాణీలు సమకూరుస్తున్నారు.

ఈ చిత్రానికి ‘విక్రమ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అదిరిపోయింది. సింగిల్ డైలాగ్ కూడా లేకుండా.. మునివేళ్లపై నిలబెట్టాడు దర్శకుడు. స్వయంగా భోజనం వండిన ఆయన అరటి ఆకుల్లో అతిథులకు వడ్డించారు. వాళ్లపై దాడి చేయడానికి ముందుగానే ఆయుధాల్ని ఇంట్లోని వివిధ ప్రదేశాల్లో దాచి పెట్టారు. ఇలా టైటిల్‌ టీజర్‌ ఆసక్తికరంగా సాగింది.