ఆ భామ బాలయ్యకు సరిపోలేదట

బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ క‌థానాయిక‌గా మలయాళ భామ ప్ర‌యాగా మార్టిన్ ని తీసుకొచ్చారు. మ‌రో క‌థానాయిక‌గా పూర్ణ‌ని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ప్ర‌యాగ మార్టిన్ బ‌య‌ట‌కు వెళ్లిపోయిన‌ట్టు టాక్. ఇటీవ‌ల‌… ప్ర‌యాగ సెట్లో అడుగుపెట్టింది.

ఆమెపై రెండు సీన్లు తీశారు. ర‌షెష్ చూశాక‌.. బాల‌య్య ప‌క్క‌న ప్ర‌యాగ ఏమాత్రం స‌రితూగ‌ద‌ని భావించిన‌ట్టు తెలుస్తోంది. అందుకే ప్ర‌యాగ‌ని ఈ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌కు పంపేశారట. బాల‌య్య ప‌క్క‌న మ‌ల‌యాళ భామ ప్ర‌యాగ  మ‌రీ చిన్న పిల్ల‌లా క‌నిపిస్తుండ‌డంతో ప్రాజెక్ట్ నుంచి త‌ప్పించార‌ని తెలుస్తోంది. ప్ర‌యాగ ప్లేస్‌లో ప్ర‌గ్యా జైస్వాల్ ని తీసుకున్న‌ట్టు స‌మాచారం. సోమ‌వారం నుంచి ప్ర‌గ్యా సెట్లో అడుగుపెట్టే అవ‌కాశాలున్నాయి. అయితే..ప్ర‌గ్యా అయినా బాల‌య్య‌కు స‌రిజోడీనా? అన్న‌దీ కూడా డౌటే.