తెలుగు, తమిళ్ బిగ్ బాస్ షోస్ కలిస్తే.. !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఇప్పటికే 8 వారాలని పూర్తి చేసుకొంది. ఈ వారంతో విజయవంతంగా 9 వారాలని పూర్తి చేసుకోనుంది. ఇక బిగ్ బాస్ తమిళ్ సీజన్ 4 ఇటీవలే ప్రారంభం అయింది. ఈ రెండు బిగ్ బాస్ షోస్ కలిస్తే ఎలా ఉంటుంది ? వినడానికే కలర్ ఫుల్లుగా ఉంది కదా. మరీ.. నిజంగా కలిస్తే.. ? ఇప్పుడు అదే  జరిగింది. 

ఈ రోజు షోలో తెలుగు, తమిళ్ బిగ్ బాస్ షోస్ కలిశాయి. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గా ప్లాన్ చేశారు. కమల్, నాగ్ సరదాగా మాట్లాడుకున్నారు. దానికి సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. సర్.. మీ హౌస్ ఫుల్లుగా ఉందని నాగ్ అనగా.. నాకి హౌస్ ఫుల్ అంటే ఇష్టమన్నారు. మనకందరికీ కూడా హౌస్  అంటే ఇష్టమని నవ్వులు పూయించారు నాగ్