శ్రీకాంత్ తనయుడికి శిక్షణ ఇస్తున్న రావు రమేష్
కె.రాఘవేంద్రరావు మరోసారి పెళ్లి సందడిని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడుగా ‘పెళ్లి సందD’ చేయబోతున్నారు. రాఘవేంద్రా రావు శిష్యురాలు గౌరిని ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు.
ఇప్పుడు రోషన్ కి డైలాగులు, నటన విషయంలో మరిన్ని మెళకువలు నేర్పుతున్నారు రాఘవేంద్రరావు. డైలాగ్స్ లో రాటు దేలడానికి ప్రముఖ నటుడు రావు రమేష్ క్లాసులు తీసుకుంటున్నార్ట. ఈ తరం క్యారెక్టర్ ఆర్టిస్టులలో . డైలాగులు చెప్పడంలో మహా దిట్ట రావు రమేష్. అందుకే ఆయన్ని తీసుకొచ్చి.. డైలాగు పాఠాలు చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయిక ఇంకా ఫిక్స్ కాలేదు. ఆమె ఎంపిక కోసం కసరత్తులు జరుగుతున్నాయి. శ్రీకాంత్ కథానాయకుడిగా వచ్చిన పెళ్లి సందడి సూపర్ హిట్ అయింది. మరీ.. ఆయన తనయుడి పెళ్లి సందD ఆ మేజిక్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.