శ్యామ్ సింగ‌రాయ్.. ఓ కాపీ కథ !

చిన్నా, పెద్దా సినిమాలనే తేడానే లేదు. వచ్చే ప్రతి సినిమాపై కాపీ మరక పడుతోంది. ఫస్ట్ లుక్ నుంచే కాపీ మరకలు అంటున్నాయ్. ఇటీవల ‘ఆచార్య’ సినిమాపై కాపీ వివాదం నడిచిన సంగతి తెలిసిందే. అయితే కాపీ కాపీ కథల వివాదాలపై నేచురల్ స్టార్  నాని పోరాటం చేయబోతున్నట్టు సమాచారమ్. ఆయన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ రాహుల్ సంకృత్య‌య‌న్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నానిది డ్యూయ‌ల్ రోల్‌.

ఓ పాత్ర‌లో ద‌ర్శ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. ఈ సంద‌ర్భంగానే `కాపీ`ల‌పై సెట‌ర్లు వేశాడ‌ట‌. క‌థానాయ‌కుడు తీసిన సినిమాపై కాపీ అనే ముద్ర ప‌డితే.. అందుకు క‌థానాయ‌కుడు స్పందించిన విధానం, `నా సినిమా కాపీ సినిమా కాదు` అని పోరాడే ప‌ద్ధ‌తి వినోదాన్ని పంచ‌బోతున్నాయ‌ట‌. అస‌లు క‌థంతా ఈ కాపీ.. చుట్టూనే తిరుగుతుంద‌ని టాక్‌. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండనున్నారు. బడ్జెట్ ని భారీగానే ఖర్చు పెడుతున్నారు.