మాటకు పాటకు శుభాకాంక్షలు చెబితే ఇలాగే ఉంటది !

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. ఇక త్రివిక్రమ్ కు బాగా నచ్చిన వ్యక్తి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ట్విట్టర్ వేదికగా త్రివిక్రమ్ ని విష్ చేశారు.

“తారలనే తెంచగలం తలచుకుంటే మనం! రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం” అంటూ కామెంట్ పెట్టారు. త్రివిక్రమ్ తో కలిసి దిగిన ఓ అందమైన ఫోటోని షేర్ చేశారు. ఇది చూసిన ప్రేక్షకులు మాటకు పాట శుభాకాంక్షలు చెబితే ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.