తెలంగాణలో థియేటర్స్ కి గ్రీన్ సిగ్నల్
కరోనా లాక్‌డౌన్ తో ఆర్నేళ్లుగా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్రం థియేటర్స్ రీ ఓపెన్ కి అనుమతినిచ్చింది. అయితే తుది నిర్ణయం మాత్రం రాష్ట్రాల చేతిలో పెట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీ ప్రభుత్వం థియేటర్స్ రీ ఓపెన్ కి అనుమతినిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అనుమతులు ఇవ్వలేదు. అయితే తాజాగా తెలంగాణలో థియేటర్స్ ఓపెన్ అవుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
శనివారం ప్రగతి భవన్ తో సీఎం కేసీఆర్ ని మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. థియేటర్స్ కి అనుమతిని ఇస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు.. హైదరాబాద్ నగర శివారుల్లో సినిమా సిటీని నిర్మించబోతున్నట్టు తెలిపారు. ఇందుకోసం 1500-2000 ఎకరాలు కేటాయిస్తామని సినీ ప్రముఖులు వెళ్లి ఆ స్థలాన్ని పరిశీలించాలని కోరారు. ఇందులో అన్నీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.