అవినాష్’తో పీకల్లోతు ప్రేమలో అరియానా !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో మరో ప్రేమ జంటపై క్లారిటీ వచ్చేసింది. ఇన్నాళ్లు బిగ్ బాస్ ఇంట్లో అఖిల్-మోనాల్, అభిజిత్-హారిక లవ్ ట్రాక్స్ మాత్రమే నడుస్తున్నాయని భావించాం. కానీ మరో జంట వీరి కంటే డీప్ గా ఉందనే విషయం నిన్నటి ఏపీసోడ్ తో వెలుగులోకి వచ్చింది. అవినాష్‌, అరియానా మ‌ధ్య గ‌త కొంత కాలంగా ల‌వ్ ట్రాక్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ విష‌యాన్ని ఆ ఇద్ద‌రూ బ‌హిరంగంగా అంగీక‌రించ‌లేదు.

ఆదివారం ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా చివ‌రిగా అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అవినాష్ మిగిలారు. అయితే వాళ్ల‌ద్ద‌రిలో ఎవ‌రు వెళుతారో తేల్చేం దుకు వినూత్న ప్ర‌క్రియ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా అవినాష్‌ను ప‌ట్టుకుని అరియానా వెక్కివెక్కి ఏడుస్తుంది. అవినాష్ వెళ్లిపోతాడేమోన‌ని అరియానాకు అనుమానం వ‌స్తుంది.

ఒక‌వేళ ఎలిమినేష‌న్ అయినా ఎలాంటి అఘాయిత్యానికి పాల్ప‌డ‌వ‌ద్ద‌ని అవినాష్‌తో మ‌ద‌ర్ ప్రామిస్ వేయించుకుంటుంది. ‘నీ కాళ్లు ప‌ట్టుకుంటా, నాకోసం ఎదురు చూడు, నువ్వు బ‌తికుంటే చాలు’ అంటూ ఎమోష‌న‌ల్ అవుతుంది. అరియానాని చూస్తే.. అవినాష్ తో చాలా డీప్ గా వెళ్లిందని అర్థమవుతోంది. ఆయనే ప్రపంచంగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. మరీ.. ఈ జంట బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికొచ్చాక పెళ్లి భోజనం పెడుతుందేమో చూడాలి.