శ్రీకారం పాట.. భలేగుంది బాల.. !

యంగ్ హీరో శర్వానంద్ తాజా చిత్రం శ్రీకారం.  ఇందులో శర్వా రైతుగా కనిపించనున్నాడు. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నాడు. శర్వా సరసన ప్రియాంకా అరుల్‌ మోహన్‌ నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి జానపద గేయం #BhalegundiBaalaaనివిడుదల చేశారు. ఈ పాటని పెంచల్ దాస్ రాశారు. స్వయంగా ఆయనే
పాడారు. శ్రీకాకుళం జానపదం  #BhalegundiBaalaa అదిరిపోయింది. ఆ పాటని మీరు ఓ సారి వినేయండీ… !