యాదాద్రికి మంత్రుల బృందం

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్ర పునర్మాణ పనులు వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. యాదాద్రి నిర్మాణ పనులని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. అధికారులతో సమీక్షలు నిర్వహించారు. పలు సూచనలు చేశారు. ఇప్పుడు ఆలయ నిర్మాణ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రేపు మంత్రుల బృందం యాదాద్రిని సందర్శించనున్నాయి.

మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌ తదితరులు యాదాద్రిలో పర్యటించనున్నారు.. ఆలయ నిర్మాణ పనులు, నూతన బస్ టెర్మినల్ పనుల పరిశీలన, ఆలయానికి వచ్చే అప్రోచ్ రోడ్లను పరిశీలించనున్నారు. వీటి నిర్మాణంపై సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.