నాగ శౌర్య కటౌట్ చూస్తే షాక్ కావాల్సిందే !

యంగ్ హీరో నాగ శౌర్య కసితో కనిపిస్తున్నారు. తనేంటో చూపించుకోవాలనే కసి  ఆయనలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం తాను ఏం చేయగలడో అదంతా చేస్తున్నాడు. ఆయన తదుపరి సినిమా కోసం సిక్స్ ఫ్యాక్ ప్యాక్ చేశాడు. ఇప్పుడు దాన్ని ఎయిట్ ప్యాక్ కు చేరిపోయాడు.ఇప్పుడు లేటెస్ఠ్ గా ఈ లుక్ కు కౌబాయ్ గెటప్ యాడ్ చేసి ఓ స్టిల్ ను సోషల్ మీడియాలోకి వదిలాడు. ఇది చూసి ఆయన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ రేంజ్ లో  నాగ శౌర్య కటౌట్ ఉంది.

వాస్తవానికి శౌర్య చాక్ లేట్ బాయ్ లా బబ్లీగా, లవ్ లీగా వుంటాడు. చేస్తున్న సినిమాల్లో అలాంటి లుక్ వున్న సినిమాలు కూడా వున్నాయి. కానీ శౌర్య ఎందుకో ఈ ఫిజికల్ ఫిట్ నెస్ లుక్ నే ఎక్కువ ఇష్టపడుతున్నట్లుంది. అందుకే దేహంపై దృష్టి సారించాడు.