బొడ్డు, నడుము కామెంట్స్’పై బుట్టబొమ్మ యూటర్న్

పూజా హెగ్డేని తెలుగు ప్రేక్షకులు నెత్తినపెట్టుకొని ఊరేగారు. స్టార్ హీరోయిన్ ని చేశారు. బుట్టబొమ్మని చేశారు. ఆమె కాళ్లని పట్టుకొని వదలనని.. పాట పాడుకున్నారు. అందుకు తెలుగు ప్రేక్షకులకి తగిన శాస్త్రి తగిలింది. మన బుట్టబొమ్మ అసలు బుద్ది చూపించింది. తెలుగు ప్రేక్షకులని చీప్ గా చూస్తూ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. తెలుగు ప్రేక్షకులు తన బొడ్డు, నడుము చూసి సొల్లు కారుస్తారని కామెంట్స్ చేసింది. దీంతో.. సగటు తెలుగు ప్రేక్షకుడికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో వేసుకున్నారు. ఆ హీటుకు పూజా దిగొచ్చింది. డ్యామేజ్ ని తగ్గించేందుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

‘నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరేమో, అభిమానాన్ని కాదు.. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రాణసమానం. ఇది నా చిత్రాలను అభిమానించే వారికీ, నా అభిమానులకు తెలిసినా.. ఎటువంటి అపార్థాలకు తావు ఇవ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నా. నాకెంతో ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. పూర్తి ఇంటర్వ్యూ చూడండి.. ధన్యవాదాలు’ అని తెలిపారు.