రానా-వెంకీ మల్టీస్టారర్.. ప్రకటన వచ్చేసింది !

బాబాయ్-అబ్బాయ్ వెంకటేష్-రానా కాంబోలో ఓ సినిమా తీయాలన్నది సురేష్ బాబు బలమైన కోరిక. ఇంకా చెప్పాలంటే రానా తాత రామానాయుడు కోరిక అది. వెంకీ, రానా, నాగ చైతన్య ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలని పెద్దాయన భావించారు. తండ్రి కోరిక తీర్చాలని సురేష్ బాబు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడీ ఈ సినిమా సెట్ అయింది. దీనిపై రానా ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు.

‘మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రావాల‌ని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. మా నిరీక్ష‌ణ కూడా దాని కోస‌మే. ఇన్నాళ్లు ఎలాంటి క‌థ కోసం ఎదురు చూశామో… అలాంటి క‌థ దొరికింది. అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తాం’ అని రానా ట్విట్ చేశారు. వచ్చే యేడాది ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.