చిరుకి కరోనా ఎఫెక్ట్.. ఎన్ని సినిమాలపై పడుతుందో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆచార్య షూటింగ్ లో పాల్గొనేందుకు ముందు కరోనా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే  హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తానని చిరు ట్విట్ చేశారు. మరోవైపు చిరు త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ ప్రముఖు ఆకాంక్షిస్తున్నారు.

ఇక చిరుకి కరోనా బారినపడటంతో ఆ ప్రభావం పలు సినిమాలపై పడేలా కనిపిస్తోంది. ఈ నెల 9నుంచి ఆచార్య షూటింగ్ ప్రారంభం కానుంది. చిరుకి కరోనా సోకడంతో ఈ సినిమా షెడ్యూల్ లో మార్పులు జరగనున్నాయ్. ఇక రామ్ చరణ్ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ ఆయనకి పాజిటివ్ గా వస్తే.. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ వాయిదా పడే ఛాన్స్ ఉంది. శనివారం చిరు, నాగ్ కలిసి సీఎం కేసీఆర్ ని కలిశారు. ఒకవేళ నాగ్ కి కరోనా వస్తే.. ఆయన తదుపరి సినిమాతో పాటు.. బిగ్ బాస్ షోకి ఇబ్బంది కలుగనుంది.