వృద్ధులు, చిన్నారులకు శ్రీవారి దర్శనం.. ఎప్పటి నుంచి అంటే ?
కరోనా మహమ్మారి దేవుళ్లని కూడా వదల్లేదు. కరోనా కారణంగా దేశంలోని దేవాలయాలన్ని కొన్నాళ్ల పాటు మూతపడిన సంగతి తెలిసిందే. తిరిగి తెరచుకున్న తర్వాత కూడా కొన్ని నిబంధనలని విధించారు. వయో వృద్దులు, చిన్నారులకి తిరుమల శ్రీవారి దర్శణానికి అనుమతి లేదు. అయితే కొత్త కోవిడ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాతే వీరికి శ్రీవారి దర్శనం ఉంటుందని తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.
తిరుమలలో ఆదివారం ‘డయల్ యువర్ తితిదే ఈవో’ కార్యక్రమంలో ఆయన భక్తుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కొవిడ్ కారణంగా తితిదే రద్దు చేసిన ఆర్జిత సేవల టికెట్ల రీఫండ్‌ను డిసెంబరు నెలాఖరు లోపు భక్తులు పొందవచ్చని తెలిపారు. 200 మంది లోపు ఆహ్వానితులతో తిరుమలలో వివాహాలు జరిపేందుకు అనుమతులు ఇస్తున్నామన్నారు.