బిహార్‌లోనూ అమెరికా తరహా ఫలితమే
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమెరికా తరహా ఫలితమే వస్తుంది. బిహార్‌లో జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ కూడా గద్దెదిగడం తప్పదని శివసేన అంటోంది. ట్రంప్ ఓటమి నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని చెప్పిన శివసేన.. తేజస్వీ యాదవ్ లాంటి యువనేత ముందు మోదీ, నితీశ్ లాంటివారు కూడా నిలువలేరంటూ విమర్శించింది.
“అమెరికాలో అధికార మార్పు జరిగింది. బిహార్‌లో కూడా అదే జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ఓడిపోతుందని స్పష్టమవుతోంది. ‘మేము తప్ప ప్రజలకు మరో ప్రత్యామ్నాయం లేదు’ అని భ్రమలో ఉన్న నాయకుల్నితొలగించేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. తేజస్వీ యాదవ్ లాంటి యువనేత ముందు మోదీ, నితీశ్ కుమార్ లాంటివారు కూడా నిలువలేరు” శివసేన ఆస్థాన పత్రిక సామ్నా పేర్కొంది.