ధావన్‌ను ట్రోల్ చేసిన యూవీ

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్ కి చేరింది. నిన్న జరిగిన హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ధావన్‌(78) పరుగులతో రాణించి 19వ ఓవర్‌లో ఔటయ్యాడు. సందీప్‌ శర్మ వేసిన 18.3 బంతికి గబ్బర్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

అయితే, అంపైర్‌ ఔటివ్వకముందే అతడు క్రీజు వదిలినట్లు కనిపించింది. కానీ రీప్లేలో ఆ బంతి ఆఫ్‌స్టంప్‌ అవతలికి వెళ్లినట్లు తేలింది. అయితే, ధావన్‌ కనీసం డీఆర్‌ఎస్‌కు వెళ్లకపోవడం యువరాజ్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్పటిలాగే డీఆర్‌ఎస్‌ కోరడం మర్చిపోయాడని యువీ సరదాగా ఆటపట్టించాడు.