ఇకపై తెలంగాణలో ఎన్నికలేవైనా భాజాపాదే గెలుపా ?

‘తెలంగాణలో ఎన్నికలేవైనా తెరాసదే గెలుపు’ అనేవారు. దానికి తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ తెరాస గెలుస్తూ వస్తోంది. ప్రతిపక్షలకి ఓ ఒక్క అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికలోనూ దూసెకెళ్తాం. గులాభి జెండాని ఎగరేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్, భాజపాలకి డిపాజిట్లు కూడా రావన్నారు. కానీ ఆయన అంచనాలని తలక్రిందులు చేస్తూ దుబ్బాకలో భాజాపా గెలుపొందింది. దుబ్బాక విజయంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయ్.

ఇకపై ‘తెలంగాణలో ఎన్నికలేవైనా గెలుపు భాజాపాదే’ అన్నట్టుగా భాజాపా విజృంభించనుంది. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లోనూ భాజాపా హవా చూపించే అవకాశాలున్నాయ్. ఎందుకంటే ? కరోనా కాలంలో వచ్చిన కరెంటు బిల్లులు, భారీ వర్షాలు, వరదల వలన కలిగి ఇబ్బందులు.. వరదసాయంలో అవినీతిపై నగర ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.ఇదీగాక ఇన్నాళ్లు తెరాసకు ప్రత్యామ్నాయం లేదని ప్రజలు భావించేవారు. ఇప్పుడు ఆలోటు తీరుస్తూ.. భాజాపా పుంజుకుంటోంది. అందుకే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎన్నికలేవైనా గెలుపు భాజాపాదే అన్నట్టుగా సాగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.. !