మహేష్ చరిత్రలో నిలిచిపోతారు : కేసీఆర్

వీర జవాన్ మహేష్ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ. 50లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు.

అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మరణం  చెందిన సంగతి తెలిసిందే.