దుబ్బాకలో ముందంజలో టీఆర్ఎస్

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదట బ్యాలెట్ ఓట్లని లెక్కిస్తున్నారు. బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపులో తెరాస ముందంజలో ఉంది. మధ్యాహ్నం 1గంట వరకు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రానుందని చెబుతున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సహా 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 315 పోలింగ్‌ బూతుల్లో 1,64,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 పోలింగ్‌ శాతం నమోదైంది. ఒక్కో రౌండుకు 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 23 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. అయితే తెరాస, భాజాపాల మధ్య గట్టిపోటీ ఉంటుందని చెబుతున్నారు. ఈ పోటీ ఎవరు విజేత నిలుస్తారు ? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.