దుబ్బాక కౌటింగ్ : 12వ రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం
దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. తొలి ఐదు రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించగా.. 6, 7, రౌండ్లలో లో తెరాసకు ఆధిక్యం లభించింది. 8,9వ రౌండ్లలో మళ్లీ భాజాపాకు ఆధిక్యం లభించింది. 10వ రౌండ్ మాత్రం తెరాసదే. ఇక 11వ రౌండ్ లో భాజాపా స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. 12వ రౌండ్ లో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది. తొలిసారి కాంగ్రెస్ ఆధిక్యత కనిపించింది.
రౌండ్ల వారీగా పోలైన ఓట్ల వివరాలు :
మొదటి రౌండ్లో 7,446 ఓట్లు లెక్కించగా.. తెరాస 2867, భాజపా 3208, కాంగ్రెస్ 648 ఓట్లు సాధించాయి. భాజపా ఆధిక్యం 341 ఓట్లు.
రెండో రౌండ్లో: 7,127 ఓట్లు లెక్కించగా.. 794 ఓట్లతో రఘునందన్‌రావు ఆధిక్యం ప్రదర్శించారు. భాజపాకు 3,284 ఓట్లు రాగా, తెరాసకు 2,490, కాంగ్రెస్‌కు 667 ఓట్లు పోలయ్యాయి.
మూడో రౌండ్లో: 6,601 ఓట్లు లెక్కించగా… భాజపా 2,731, తెరాసకు 2,607, కాంగ్రెస్‌కు 616 ఓట్లు పోలయ్యాయి. భాజపా ఆధిక్యం 124 ఓట్లు.
నాలుగో రౌండ్: భాజపాకు 3,832, తెరాస 2,407, కాంగ్రెస్‌కు 227 ఓట్లు పోలయ్యాయి.
ఐదో రౌండ్: భాజపా 3,462, తెరాస 3,126, కాంగ్రెస్‌కు 566 ఓట్లు పోలయ్యాయి.
ఆరో రౌండ్లో: తెరాస 4,062, భాజపా 3,709, కాంగ్రెస్ 530 ఓట్లు పోలయ్యాయి. తెరాస ఆధిక్యం 353 ఓట్లు.
ఏడో రౌండ్లో : మిర్దొడ్డి మండలంలో ఓట్లు లెక్కించగా..తెరాసకు 2,718, భాజపాకు 2,536, కాంగ్రెస్‌కు 749 ఓట్లు పోలయ్యాయి. తెరాసకు 182 ఓట్ల ఆధిక్యం.
ఎనిమిదో రౌండ్లో: భాజపా 3,116, తెరాస 2,495, కాంగ్రెస్‌కు 1,122 ఓట్లు లభించాయి.