హరీష్ రావు రాజీనామా ?

దుబ్బాకలో భాజాపా దూకుడు కొనసాగుతోంది. ప్రస్తుతానికి భాజాపా అభ్యర్థి రఘునందన్ రావు 1100పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు. దుబ్బాకలో భాజాపా గెలిస్తే గనుక.. తెలంగాణలో ఆ పార్టీ వేవ్ మొదలైనట్టే. ఈ ఊపులో గ్రేటర్ ఎన్నికల్లోనూ ఊపేసే ఛాన్స్ ఉంది. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస ఓడితే మంత్రి హరీష్ రావుకు ఇజ్జత్ పోనుంది. ఎందుకంటే ? హరీష్ రావు ఓటమి ఎరగని నేత. ఆయన బరిలో నిలిచినా.. ఆయన బాధ్యత తీసుకున్నా గెలుపే. కానీ ఓటమి లేదు. దుబ్బాకలో తెరాస ఓడితే.. తొలిసారి హరీష్ రావుకు ఎదురుదెబ్బ తగిలినట్టే.

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాజాపా, కాంగ్రెస్ లకి డిపాజిట్లు కూడా రావని మంత్రి హరీష్ రావు బల్లగుద్ది మరీ చెప్పారు. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వ నిధులపై తెలంగాణ భాజాపా నేతలకి సవాల్ విసిరారు. హరీష్ విసిరిన సవాళ్లని స్వీకరిచేందుకు భాజాపా నేతలు జంకారు. కానీ ఆ సవాళ్లు తెరాసకు ఓట్లని కురిపించలేదేమోనని తాజా ట్రెండ్ ని చూస్తే అర్థమవుతోంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికలో ప్రస్తుతం ఓట్లు లెక్కించింది.. దుబ్బాక అర్భన్, రూలర్ మాత్రమే.. మిగితా మండలాలు వచ్చే సరికి కారు జోరు మొదలవ్వొచ్చని చెబుతున్నారు. ఒకవేళ దుబ్బాకలో తెరాస ఓడితే మంత్రి హరీష్ రావు రాజీనామా చేస్తారనే ప్రచార ఉంది.