టీఆర్ఎస్’ని ఓడించిన ఎంఐఎం !?

దుబ్బాక ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. దుబ్బాక ఉపఎన్నిక ఉత్కంఠపోరులో భాజాపా అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెరాసకు ఎదురైన తొలి పరాజయం ఇది. దీనికి కారణం ఏంటీ ? అనే విశ్లేషించే పనిలో రాజకీయ విశ్లేషకులు ఉన్నారు.

ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస ఓటమికి ఎంఐఎం ఓ కారణమని చెబుతున్నారు. ఎందుకంటే ? తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తెరాస-ఐఎంఐ కలిసి పోటీ చేస్తూ వస్తున్నాయ్. అయితే దుబ్బాక ఉప ఎన్నికలో తెరాసకి ఓటు వేయమని ఎంఐఎం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. దీనికి కారణంగా అక్బరుద్దీన్ కారణమని చెబుతున్నారు. ఆయన కేసుని రఘునందన్ రావు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి వ్యతిరేకంగా దుబ్బాకలో ప్రచారం చేయడానికి ఎంఐఎం సాహసించలేదు.

మరోవైపు తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ దుబ్బాకలో మున్నూరు కాపు ఓటర్లని ఏకం చేశారు. ఈ ఒక్క నియోజకవర్గంలో దాదాపు 20వేలకుపైగా మున్నూరు కాపు ఓటర్లు ఉన్నారు. మరో 15వేలకుపైగా ముదిరాజు ఓటర్లు ఉన్నారు. వీరిని భాజాపా వైపు తిప్పారు బండి. తెరాస ఓటమికి మరో కారణం.. దుబ్బాక పక్కనున్న సిద్దిపేట, గజ్వెల్ నియోజవర్గాలు అభివృద్దిలో దూసుకుపోతున్నా.. దుబ్బాక మాత్రం వెనకబడింది. దీనిని దుబ్బాక ప్రజలు మనసులోపెట్టుకొని భాజాపా వైపు మళ్లినట్టు కనిపిస్తోంది.