సీక్రెట్ రూమ్ లో అఖిల్.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. !

బిగ్ బాస్ షో అంటేనే బోలెడన్ని షాకింగ్ ట్విస్టులు, సప్రైజ్ లు ఉంటాయ్. గత సీజన్ లలోనూ వాటిని ప్రేక్షకులు చూశారు. ఏంజాయ్ చేశారు. తాజా సీజన్ లోనూ అలాంటి ఝులక్ ఇస్తూనే  ఉన్నారు బిగ్ బాస్. నిన్నటి ఏపీసోడ్ లో ఇంటి సభ్యులంతా కలిసి ఏకాభిప్రాయంతో ఓ సభ్యుడిని బయటికి పంపాలని కోరాడు.

తర్జభర్జన తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ అఖిల్ ని ఇంటి నుంచి గెంటేశారు. మోనాల్ కూడా అఖిల్ ని బయటికిపంపేందుకు నామినేట్ చేయడం విశేషం. అయితే బయటికి వెళ్లడమే అఖిల్ కి వరమైంది. అది ఎలిమినేషన్ కాదు. ఫేక్ ఎలిమినేషన్. అఖిల్ ని సీక్రెట్ రూమ్ లో ఉంచారు. సకల వసతులు కల్పించారు.

సీక్రెట్ రూమ్ లో నుంచి ఇంటి సభ్యులని చూసే అవకాశం కల్పించారు. ఇక అఖిల్ వెళ్లిపోయిన తర్వాత అభిజిత్ అనాలసిస్… దానికి సీక్రెట్ నుంచి అఖిల్ రియాక్షన్ ఆకట్టుకున్నాయ్. అఖిల్ వెళ్లిన తర్వాత మోనాల్, సోహైల్ ఎమోషనల్ అయ్యారు. ఇక సీక్రెట్ రూమ్ లో వెళ్లిన అఖిల్ థాంక్యూ బిగ్ బాస్, ఇక్కడ నుంచి ఎవరు ఎలా ఆట ఆడుతున్నారో అన్నీ తెలుస్తాయి.. అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పాడు.