తెలంగాణలోనూ దీపావళి క్రాకర్స్ బ్యాన్ !

దేశంలో కరోనా ఉద్రితి ఇంకా తగ్గలేదు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు దీపావళి సెలబ్రేషన్స్ పై ఆంక్షిలు విధిస్తున్నాయ్. ఇప్పటికే ఢిల్లీ, కర్నాటక, యూపీ, ఏపీ తదితర రాష్ట్రాలు క్రాకర్స్ కాల్చడాన్ని బ్యాన్ చేశాయి. తాజాగా ఈ జాబితాలో తెలంగాణ కూడా చేరింది. అయితే ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు. ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని.. దీపావళి సందర్బంగా క్రాకర్స్ కాల్చడానికి బ్యాన్ చేస్తూ.. ప్రభుత్వం ప్రకటన చేయాలని హైకోర్ట్ ఆదేశించింది.

కరోనా నేపధ్యంలో దీపావళి పండుగ సమయంలో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది ఇంద్ర ప్రకాష్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో కరోనా కేసులు ఇంకా ఉన్నాయని.. ఈ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ని విచారించిన హైకోర్టు తెలంగాణలో క్రాకర్స్ ని కాల్చడం బ్యాన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలన్న హై కోర్టు ఎవ్వరూ క్రాకర్స్ అమ్మడం గాని , కొనడం గాని చేయొద్దని కోరింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని హైకోర్టు సూచించింది.