మోహన్ బాబు అభిమానులకి నిరాశ

చాన్నాళ్ల తర్వాత డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటించిన చిత్రం ‘ఆకాశం నీ హ‌ద్దురా’. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే సినిమా చూసిన మోహన్ బాబు అభిమానులకి షాక్ తగిలింది. ఈ సినిమాలో ఆయ‌న్ని అతిథిని చేసేశారు.

మూడంటే మూడే స‌న్నివేశాల్లో ఆయ‌న తెర‌పైకొచ్చారు. ఎన్ని స‌న్నివేశాల‌న్న‌ది ప‌క్క‌న పెడితే, ఆ పాత్ర‌ని డిజైన్ చేసి, చూపించే విధానంపై పెద్ద‌గా క‌స‌ర‌త్తు చేయలేద‌నిపించింది. దానికి తోడు ఈ పాత్ర చేయ‌డానికి మోహ‌న్ బాబునే అవ‌సరం లేదు. ఎవ‌రైనా ఫ‌ర్వాలేదు. మోహ‌న్ బాబు లాంటి ఆర్టిస్టుని తీసుకున్న‌ప్పుడు ఆ పాత్ర‌కు మ‌రింత వెయిటేజీ ఇస్తే బాగుండేది. క‌నీసం తెలుగు ప్రేక్ష‌కుల కోస‌మైనా అది చేయాల్సింది. ఈ విషయం పక్కనపెడితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లోనూ మోహన్ బాబు పాల్గొనలేదు. తన పాత్రని తీర్చిదిద్దిన విధానంపై అసంతృప్తితోనే ఆయన ప్రచారానికి దూరంగా ఉంటారని ఇప్పుడు అర్థమవుతోంది.