తొలి అనుభవాన్ని పంచుకున్న రకుల్ !

తొలి అనుభవం.. ఓ మధుర జ్ఝాప్తకం. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తాను తొలిసారి కెమెరా ముందుకొచ్చిన అనుభవాన్ని మదిలో జాగ్రత్తగా దాచుకుంది. తాజాగా ఆ అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. ఇంతకీ రకుల్ ఏం చెప్పింది అంటే.. ?

‘ఢిల్లీలో డిగ్రీ చదువుతున్నాను. కన్నడ మూవీ ఆఫర్ వచ్చింది. సౌత్ లో ఓ ఇండస్ట్రీ కూడా ఉందని అప్పటివరకు నాకు తెలియదు. షూటింగ్ కు ఒక్క రోజు ముందు మాత్రమే వెళ్లాను. ఎలాంటి రిహార్సల్స్ లేవు. హీరో బైక్ పై ఉన్నారు. నేను వెనక నుంచి నడుస్తుంటాను. అతడు నా వైపు సీరియస్ గా చూసి నన్ను ఫాలో అవ్వొద్దు అంటాడు. నేను మళ్లీ వెనక్కి వచ్చేయాలి. ఆ సీన్ నా ఫస్ట్ షాట్. బాగా చేశానని అంతా మెచ్చుకున్నారు. అప్పుడు నా వయసు 18.’అని తన తొలి రోజు షూటింగ్ అనుభవాన్ని బయటపెట్టింది రకుల్.