రేపు తెలంగాణ కేబినేట్ భేటీ.. చర్చించనున్న అంశాలివే !

తెలంగాణ కేబినేట్ రేపు సమావేశం కానుంది. రేపు సాయంత్రం 4 గంటలకి కేబినేట్ భేటీ ఉండనుంది. ఈ సమావేశంలో గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్త్రోంది. దీంతో పాటు సన్న రకం ధాన్యానికి మద్దతు ధరపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.

వర్షాల వల్ల పంట నష్టం, హైదరాబాద్‌ లో భారీ వర్షాలు-వరదల నష్టంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కొత్త సాదా బైనామాల దరఖాస్తులను క్రమబద్ధీకరించొద్దంటూ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా రేపటి కేబినేట్ లో చర్చించనున్నారు.

మరోవైపు డిసెంబర్ 4న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయ్. దీపావళీ మరుసటిరోజునే గ్రేటర్ నోటిఫికేషన్ రిలీజ్ కానుందని చెబుతున్నారు. ఇవాళ ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై చర్చించింది. మరోవైపు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఈసీ పరిశీలించనుంది. ఎన్నికల కోసం సిబ్బందికి శిక్షణను పూర్తి చేసింది.