తెలంగాణ కాంగ్రెస్ బాధ్యత తీసుకొనేవారే లేరా ?

దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి బాధ్యతని మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ కూడా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రాగానే మీడియా ముందుకొచ్చారు. తమకు ఓట్లు వేసిన వారికి, కార్యకర్తలని కృతజ్ఝతలు చెప్పారు. ఇక దుబ్బాక ఉప ఎన్నికలలో గెలుపు కార్యకర్తలకి అంకితమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.

గెలిచిన రఘునందన్ రావు దుబ్బాక ప్రజలు, కార్యకర్తలకి, తన కోసం ప్రచారం చేసిన పార్టీ నేతలు, పెద్దలకి కృతజ్ఝతలు తెలిపారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ది మాత్రం విచిత్ర పరిస్థితి. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి బాధ్యత తీసుకొనే కాంగ్రెస్ నేతనే కరువయ్యారు. ఒకవేళ గెలిస్తే మాత్రం అందరూ చక్కలు గుద్దుకొనేవారు. ఓడితే మాత్రం ఒక్కరు ఆ బాధ్యత నాదే అని చెప్పలేపోతున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమికి బాధ్యుడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డినే అని చాలామంది అంటున్నారు. అయితే దానికి కొందరు అంగీకరించడం లేదు. ఓటమికి ఉత్తమ్ బాధ్యుడు కాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మరీ.. ఓటమికి బాధ్యత తీసుకోని నేత పీసీసీ చీఫ్ గా ఉండటం ఎందుకు ? అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.