బిగ్ సీక్రెట్స్ : అభిజిత్ గే.. లాస్య కంటే ఆమె భర్త చిన్నోడు.. !!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గురువారం ఏపీసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంటి నుంచి వచ్చిన లేఖలని పొందాలంటే ఇంటి సభ్యులు తమ జీవితంలో ఎవ్వరికీ చెప్పిన ఓ సీక్రెట్ ని పంచుకోవాలని బిగ్ బాస్ కోరారు. దీంతో.. ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి బిగ్ సీక్రెట్ ని విప్పడం మొదలెట్టాడు. అభిజిత్ తొలిసారి అమెరికా టూర్ కి వెళ్లినప్పుడు ఓ బార్ కి వెళ్లాడట.

అక్కడ కొందరు యువకులు వచ్చి చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారట. హగ్, కిస్.. ఇలా రొమాంటిక్ గా మూవ్ అవ్వడం చూసి.. ప్రశ్నిస్తే.. బ్రో ఇది గే బార్. మీరు కూడా గే.. నే కదా. ఐ  లైక్  యూ అన్నారట. బయటికొచ్చి.. చూస్తే అది గే బార్. ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరితో పంచుకోలేదని అభిజిత్ చెప్పుకొచ్చారు. ఆయన సీక్రెట్ కి అఖిల్ కూడా కన్ఫిన్స్ అయ్యాడు. ఆయన లెటర్ ని పంపించారు. 

ఇక లాస్య ఆమె అమ్మకు మరో షాక్ ఇచ్చింది. తల్లిదండ్రులకి తెలియకుండానే లాస్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2010లో పెళ్లి చేసుకొని 2017 వరకు రహస్యంగానే ఆమె కాపురం చేసింది. 2017లో ఆమెకి తల్లిదండ్రుల సమక్షంలో మళ్లీ పెళ్లి చేశారు. తాజాగా మీ అల్లుడు నా కంటే ఓ సంవత్సరం చిన్నోడు.

నా కంటే వయసులో చిన్నోడు. కానీ మనసులో చాలా పెద్దొడు. నన్ను చాలా బాగా చూసుకుంటాడని లాస్య చెప్పుకొచ్చింది. ఇక సోహైల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి.. రెండు, మూడు రోజులు జైలు ఉన్న విషయం బయటపెట్టాడు. అరియానా, అవినాష్ లకి మాత్రం అఖిల్ లెటర్స్ పంపించలేదు. వారు చెప్పిన సీక్రెట్స్.. సీక్రెట్స్ గా లేవని ఆయన అభిప్రాయపడ్దారు.