బాణసంచా కాలిస్తే.. భారీ మూల్యం చెల్లించక తప్పదు !

రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా వినియోగాన్ని నిషేధించడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తక్షణం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాణసంచా దుకాణాల మూసివేతకు చర్యలు తీసుకోవాలంది. ప్రజలు, సంస్థలు టపాసులు వినియోగించకుండా చూడాలని పేర్కొంది. జనాన్ని అప్రమత్తం చేస్తూ ముద్రణ, సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయాలని  ఆదేశించింది.

ఈ నేపథ్యంలో బాణసంచాపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళీ సందర్బంగా బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ కలెక్టర్లు, సీపీలు,ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే టపాసుల దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.