ఆర్ఆర్ఆర్ దీపావళి సప్రైజ్

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. రామ్‌ చరణ్‌, జూ ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి ముచ్చటిస్తున్న ఫోటోలను ఆర్‌ఆర్‌ఆర్‌ ట్విటర్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. అందరి జీవితాల్లో ఈ దీపావళి మరిన్ని వెలుగులు నింపాలని పేర్కొంది.

ఈ ఫోటోల్లో తారక్, చరణ్, జక్కన్న ముగ్గురు సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. దీపావళికి ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి వచ్చిన బహుమతిగా దీన్ని ప్రేక్షకులు భావిస్తున్న్నారు. ఇక ఈ సినిమాలో అలియాభట్‌, ఓలివియా మోరీస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది.