ఆమె బాత్ రూమ్ లో కూడా కెమెరాలు పెట్టారట

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మరియమ్ నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్నప్పుడు తన గదితో పాటు బాత్రూమ్‌లో కూడా కెమెరాలు పెట్టారని ఆరోపించారు. గతేడాది చౌదరి షుగర్ మిల్స్‌ కేసులో మరియమ్ నవాజ్ అరెస్టై జైలు జీవితాన్ని గడిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరియమ్ తన జైలు అనుభవాలని పంచుకున్నారు.

‘నేను రెండు సార్లు జైలుకు వెళ్లాను. జైలులో మహిళలతో ఎలా వ్యవహరిస్తారనే దాని గురించి నేను మాట్లాడం మొదలుపెడితే.. ఇక్కడి ప్రభుత్వం, అధికారులు ముఖం కూడా చూపించలేదు. పాకిస్తాన్‌లోనైనా, మరెక్కడైనా గానీ స్త్రీలు బలహీనంగా లేరు. నన్ను వేధింపులకు గురిచేసినప్పుడు నేను ఏడవడానికి ఇష్టపడలేదు. వేధింపులకు కుంగిపోకుండా ఆ సత్యాన్ని ప్రపంచానికి తెలియాజేయాలని అనుకున్నాను. జైలులో ఉన్నప్పుడు తన గదితో పాటు బాత్రూమ్‌లో కూడా కెమెరాలు పెట్టారు’ అని ఆరోపించారు