ఆహా కోసం బన్నీ బోల్డ్ యాడ్.. చూశారా ?

కరోనాకి ముందు, ఆ తర్వాత అన్నట్టుగా ఎంటర్ టైన్ మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయ్. కరోనా లాక్‌డౌన్ తర్వాత ఓటీటీలకి బాగా డిమాండ్ పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకొనేందుకు బడా నిర్మాతలు, బడా నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయ్. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ వందశాతం తెలుగు కంటెంట్ తో ‘ఆహా’ యాప్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఆహాలోకి కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోస్ క్యూ కడుతున్నాయ్. ఈ నేపథ్యంలో ఆహాని ప్రమోట్ చేసేందుకు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. ఆహా కోసం ఓ బోల్డ్ యాడ్ చేశారు. శుక్రవారం ఆహా యాప్ అధికారిక లాంచ్ సందర్భంగా ఈ యాడ్ ని విడుదల చేశారు. అబ్బో.. ఈ యాడ్ లో బన్నీ రొమాన్స్ లో ఇరగదీశాడు.

ఈ యాడ్ లో ప్రియురాలి ఇంట్లోకి దూరి.. ఆమెతో రొమాన్స్ మునిగిపోతాడు బన్నీ. ఇంతలో ఆమె తల్లిదండ్రులు వస్తారు. తలుపు తట్టి.. ఏమె మగవారి వాయిస్ వినిపిస్తుందని మంచం కిందా చెక్ చేస్తారు. ఆ తర్వాత ఆమె బ్రదర్ వచ్చి.. కప్ బోర్డ్స్ లో చెక్ చేస్తాడు. కానీ ఎవరు కనిపించరు. బన్నీ మాత్రం అపార్ట్ మెంట్ గోడ కింద దాక్కుంటాడు. బేబీ రాత్రంతా ఎలా టైమ్ పాస్ అయిందని అడిగితే… ఆహా ఉందిగా అంటాడు బన్నీ. ఇక్కడ కాన్సెప్ట్ గురించి పక్కనపెడితే.. రొమాన్స్  హైలైట్ గా నిలిచింది.